
ఇప్పుడు జూలై 24వ తేదీ థియేటర్స్ లో సినిమా రిలీజ్ కావడానికి సర్వం సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో చేయాలి అంటూ ఫిక్స్ చేశారట మూవీ మేకర్స్ . అయితే కొన్ని కారణాలు చేత తిరుపతిలో ఈవెంట్ క్యాన్సిల్ చేసి విశాఖపట్నంలో పెట్టాలి అని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా వస్తున్న ఇద్దరు పేర్లు ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈవెంట్ గెస్ట్ లిస్టులో టాప్ దర్శకులు ఉండడం గమనార్హం. మన చరిత్రపై బాగా అవగాహన ఉన్న దర్శకులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. అలాగే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి .. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది .
"కీరవాణి" ఈ సినిమాకి సంగీతం అందించారు . ఇక ఎలాగో జక్కన్న కీరవాణికి బంధువు.. జక్కన్న ప్రజెన్స్ చాలా చాలా హైలెట్ గా ఉంటుంది . ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కి రైట్ హ్యాండ్ త్రివిక్రమ్ అంటూ ఎప్పటినుంచో టాక్ ..ఇక లెఫ్ట్ హ్యాండ్ గా పవన్ కళ్యాణ్ కి రాజమౌళి మారబోతున్నాడు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.