జూనియర్ సినిమాతో గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కిరీటి రేంజ్ మారిపోతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి  ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  కిరీటి  జూనియర్ ఎన్టీఆర్ అంటే  తనకు  ఎంతో  అభిమానమని   తారక్ నటించిన సినిమాల్లో టెంపర్ సినిమా ఎంతగానో నచ్చిందని  తెలిపారు.  టెంపర్  సినిమాలో క్లైమాక్స్  సీన్ అంటే ఎంతో   ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ కు చాలా పెద్ద అభిమానమని  ఆయన చెప్పుకొచ్చారు.

నా సినిమా ఫంక్షన్ కు  జూనియర్ ఎన్టీఆర్  వస్తే  ఎంతో  ఆనందంగా ఉంటుందని వెల్లడించారు. మరి తన  అభిమాని  కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారేమో  చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ను కలిస్తే  ఎంతో  సంతోషంగా ఫీలవుతానని  పేర్కొన్నారు.   ఏ తెలుగు సినిమా వచ్చినా  కన్నడ సినిమా వచ్చినా  థియేటర్ కు వెళ్లిపోయానని  కిరీటి  పేర్కొన్నారు.  ఏదో ఒకటి సాధిస్తే మాత్రమే స్టార్స్ అవుతారని  ఆయన వెల్లడించారు.

బళ్లారిలో జూనియర్  ఎన్టీఆర్, బాలయ్యకు  ఎక్కువ సంఖ్యలో  అభిమానులు ఉన్నారని  కిరీటి పేర్కొన్నారు.  జూనియర్ ఎన్టీఆర్ ను  చూసినప్పుడు  ఉత్సాహం వస్తుందని  ఆయన తెలిపారు.  లవ్ దెబ్బా, పక్కా లోకల్ సాంగ్స్ ఎంతగానో నచ్చాయని   కిరీటి  వెల్లడించారు.  ఈ సినిమా  రెండు భాషల్లో  తెరకెక్కిందని  ఆయన వెల్లడించారు.  సినిమాలో కన్నడ వాళ్ళు సైతం ఎక్కువగా నటించారని ఆయన  పేర్కొన్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: