రాజమౌళి సినిమాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయి  అనేదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  ఆయన సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకపోయినా ఆ సినిమాకి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియా ఫిలిం వర్గాలలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబు తో తెరకెక్కించే  సినిమా గురించి జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . రాజమౌళి ఈ సినిమాతో మరింత స్థాయికి ఎదగడం కన్ఫామ్ అంటున్నారు.


సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీస్ ఎన్నో ఎన్నో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి అంటూ తెలుస్తుంది . కాగా  ఈ సినిమాలో మహేష్ బాబుకి ఆపోజిట్ క్యారెక్టర్ లో ఒక స్టార్ హీరో నటించబోతున్నాడు అంటూ ఇన్నాళ్లు వార్తలు వినిపించాయి . అయితే రీసెంట్ గా అది కన్ఫామ్ అయిపోయింది . ఎస్ ఎస్ ఎం బి 29 సెట్స్ లో పాల్గొనడానికి హైదరబాద్ వచ్చిన ఓ స్టార్ హీరో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఆయన మరెవరో కాదు మలయాళీ నటుడు "పృథ్వీరాజ్ సుకుమారణ్".



తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్  ఎస్ ఎస్ ఎం బి 29 సెట్స్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీంతో ఇన్నాళ్లు  ఫేక్ అనుకున్న వార్త నిజమైంది అంటూ జనాలు ఈ సినిమాపై హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది . ఈ చిత్రీకరణలో తాజాగా పృథ్వీరాజ్ సుకుమారణ్ భాగమయ్యారు. ఆయన రీసెంట్గా హైదరాబాద్ కి వచ్చిన విజువల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి . దీంతో వీళ్లిద్దరి మధ్య సీన్స్ బాగా హైలైట్ గా ఉండబోతున్నట్లు మాట్లాడుకుంటున్నారు జనాలు.  కాగా కొత్త యాక్టర్స్  మాత్రమే తీసుకున్నందుకు ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.  వాళ్లు కూడా సెట్ అయితే త్వరలోనే కెనడా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది . మొత్తానికి జక్కన్న మహేష్ బాబుతో ఏదో భారీ రేంజ్ లో కొట్టేలానే ఉన్నాడు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: