
ఇటీవల సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. ఈ సినిమా పై మంచి ప్రమోషన్ జరిగింది. వెంకయ్య నాయుడు వంటి దేశ స్థాయి నాయకులు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా సినిమా గురించి మాట్లాడారు. పోస్టర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో బాగానే పంచుకున్నారు. కానీ సమస్య అక్కడే. ట్రాఫిక్ ఉన్నా.. టికెట్ తీసుకున్నవాళ్లు లేరు అనే మాటను నిజం చేస్తూ, సినిమా థియేటర్లలో ప్రేక్షకుల స్పందన లేకుండా మూలపడిపోయింది. టీవీ క్రేజ్ థియేటర్‌కి మారటం లేదు అన్నది మళ్లీ మరోసారి స్పష్టమైంది.
ఇలా వెండితెరపై ఫెయిలైన ఇతర టీవీ స్టార్లు .. యాంకర్ ప్రదీప్ – మంచి ఫాలోయింగ్ ఉన్నా, సినిమాల్లో నడవలేదు , సుడిగాలి సుధీర్ – రియాలిటీ షోల్లో హిట్టయినా, సినిమాల్లో బ్రేక్ దక్కలేదు , ధనరాజ్, గెటప్ శ్రీను, షంకర్ – స్కిట్ కమెడియన్లుగా పాపులర్ అయినా, హీరోగా నిలబడలేకపోతున్నారు
టీవీ నుంచి సినిమా వరకు మారటం ఎందుకు కష్టం..? రోజూ కనిపించే ఫేస్‌కి థియేటర్‌లో ప్రత్యేకత ఉండదు , టీవీలోని పాత్రతో ఓ ఫిక్స్డ్ ఇమేజ్ ఉండిపోతుంది .. సినిమాకు కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ ఉండదు .. కథ ఎంపికలో లోపాలు, ఓవరైటెడ్ ప్రమోషన్ – కాన్టెంట్ లేకపోవడం. విజయానికి మార్గం ఏమిటి? ఒకటే స్పష్టమైన నిజం:టీవీ క్రేజ్ సినిమాలకు ట్రాన్సఫర్ కావాలి అంటే, కథ బలంగా ఉండాలి.
టీవీ మోల్ బ్రేక్ చేయగల స్క్రిప్ట్స్ కావాలి , కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలి, సినిమాటిక్ బాడీ లాంగ్వేజ్ మెరుగుపరచాలి ,ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించే గ్రిప్పింగ్ పాయింట్స్ ఉండాలి , మంచి డైరెక్టర్ & టెక్నికల్ టీమ్ అవసరం .. ఇది అసాధ్యమా..? కాదు! యశ్, షారుఖ్, శుషాంత్ ప్రూవ్ చేసారు .. kgf యశ్ – టీవీ నుంచి స్టార్ అయ్యాడు , షారుక్ ఖాన్ – టీవీ నుంచి బాలీవుడ్ బాద్‌షా, శుషాంత్ సింగ్ రాజ్‌పుత్ – టీవీ నుండి ఫిల్మ్‌ఫేర్ వరకు! ఇలా వాళ్లకు బ్రేక్ వచ్చిన సినిమా ఒక్కదే కాదు – సరైన కంటెంట్ కలిగిన సినిమా. టీవీ నుంచి సినిమా వరకు ప్రయాణం తేలిక కాదు. కానీ కంటెంట్, ప్రెజెన్స్, పర్సిస్టెన్స్ ఉంటే సాధ్యమే. ఆర్కే సాగర్, ప్రదీప్, సుధీర్ లాంటి వారు హార్డ్ వర్క్ చేస్తున్నారు – కానీ పెర్ఫెక్ట్ స్క్రిప్ట్, పక్కా గైడెన్స్, మరియు ప్రస్తుత థియేటర్ మార్కెట్‌ను అర్థం చేసుకునే దృక్పథం అవసరం.