ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన `పుష్ప ది రైజ్` చిత్రంలో స్టార్ బ్యూటీ సమంత చేసిన `ఊ అంటావా ఊ ఊ అంటావా..` ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాక్ స్టార్ దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. 2021 డిసెంబర్ 10న విడుదలైన ఈ పాట అన్ని భాషల్లోనూ విపరితమైన ఆదరణ సొంతం చేసుకుంది. లిరిక్స్, దేవిశ్రీ అందించిన‌ మ్యూజిక్ మ్యూజిక్, సమంత గ్రేస్ ఫుల్ డ్యాన్స్ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. సెల‌బ్రిటీలు, స్టార్ క్రికెట‌ర్స్ కూడా ఈ పాట‌ల‌కి స్టెప్పులు వేసి అల‌రించారు


అయితే ఈ పాటను విదేశీయులు కాపీ కొట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ స్వయంగా వెల్లడించారు. దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న దేవిశ్రీప్రసాద్.. తాను చైన్నైలో ఐదు భాషల్లో క్రియేట్ చేసిన ఊ అంటావా సాంగ్ ను ఎవ‌రో కాపీ కొట్టారు. వాళ్లపై కేసు వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అదే సమయంలో తెలుగు పాటను విదేశీయులు కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉందని పేర్కొన్నాడు.


అంతే నెటిజ‌న్ల‌ను పుష్ప సాంగ్ ను కాపీ కొట్టింది ఎవరో తెలుసుకునేందుకు సెర్చింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టర్కిష్ సింగర్ అతియే స‌మంత సాంగ్‌ను కాపీ చేసిన‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్ మ్యూజిక్‌ను మ‌క్కీకి మ‌క్కీ దించేస్తూ టర్కిష్ భాషలో ‘అన్లయినా..’ అంటూ ఓ ప్రైవేట్ సాంగ్‌ను రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ పాట నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. పుష్ప సాంగ్‌, ఆ ప్రైవేట్ సాంగ్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉండ‌టంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం నెటిజ‌న్ల వంతైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: