సినిమా ఇండస్ట్రీ లో కొం త మం ది కేవలం నటన పై ఆసక్తి చూపిస్తూ వస్తే మరి కొంత మంది మాత్రం కేవలం నటన పై మాత్రమే కాకుండా ఇతర వాటిపై కూడా ఆసక్తి ని చూపిస్తూ వాటిలో కూడా మంచి ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నా రు . తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది నటులు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా మరికొన్ని క్రాఫ్ట్ లలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటూ ఫుల్ జోష్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మన తెలుగు హీరోలు ఎంతో మంది తమ సినిమాలకు పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో ఒక పాటను రామ్ పోతునేని స్వయంగా రాశాడు. ఆ పాట మరికొన్ని రోజుల్లో విడుదల కూడా కానుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటనలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తూ మంచి జోష్లో దూసుకుపోతున్నాడు. ఇక నవీన్ పోలిశెట్టి తాను హీరో గా నటించిన సినిమాలకు కథలను కూడా రాసుకుంటున్నాడు. అలా కొన్ని సినిమాలకు ఆయన కథలు రాసుకొని మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అలాగే అడవి శేషు కూడా తాను హీరోగా నటించే సినిమాలకు కథలను రాసుకుంటున్నాడు. ఇక సిద్దు జొన్నలగడ్డ , కిరణ్ అబ్బవరం కూడా తామ సినిమాల విషయంలో అనేక పనులను చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు చాలా మంది కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఇతర క్రాఫ్ట్ లలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటూ మంచి జోష్లో ముందుకు సాగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: