- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నా సినిమా కోసం పెట్టిన ప్రయత్నం, కథలోని ప్రత్యేకత అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో కొన్నాళ్లుగా కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉండ‌డంతో ఫ్యాన్స్ లో టెన్షన్ వాతావరణం కూడా కనిపించింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో విడుదలపై అనేక అనుమానాలు, గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సందేహాలన్నింటికీ చెక్ పెట్టినట్టుగా మేకర్స్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ - ఎల్ ఎల్ పీ నైజాం హక్కులు పొందినట్టు అధికారికంగా ప్రకటించారు. ముందుగా నిర్మాతలే స్వయంగా ఈ ప్రాంతంలో సినిమా విడుదల చేస్తారని వార్తలు వచ్చినా, ఇప్పుడు మైత్రి సంస్థ ఈ బాధ్యతను తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఇది చూస్తుంటే నైజాం మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్, ఎక్కువ స్క్రీన్లలో విడుదలతో హరిహర వీరమల్లు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నైజాంలో గ‌ట్టి పోటీ ఉన్నా మైత్రీ త‌న ప‌వ‌ర్ ఏంటో మ‌రోసారి చూపించింది. ఈ సినిమా కథ 17వ శతాబ్దంలో నేపథ్యంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక టెంపుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నాడు. మొఘ‌ల్ సామ్రాజ్యంలో మత సామరస్యాన్ని నిలబెట్టే యోధుడిగా ప‌వ‌న్‌ పాత్ర ఉండ‌బోతోంది. అలాంటి విభిన్నమైన నేపథ్యం, చారిత్రక గ్రాంధియత కలగలసిన కథ కావడంతో, సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి పని చేశారు. ఆయన సంగీతం ఈ చారిత్రక చిత్రానికి మరింత బలం కానుంది. దర్శకులు క్రిష్ - ఏఎం. జ్యోతికృష్ణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుండగా , బాబి డియోల్ విల‌న్‌గా న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: