కాలాలను బట్టి చెరువుల్లో కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగానే సినీ ఫీల్డ్ లో కూడా కొత్తవాళ్లు వచ్చే కొలది పాత వాళ్ళు కాస్త ఫెడవుట్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది దశాబ్దాల పాటు కొనసాగినా కానీ, ఏజ్ మీద పడ్డ తర్వాత ఇండస్ట్రీ వారిని యాక్సెప్ట్ చేయదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో  ఈ తంతు ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. మహా అయితే హీరోయిన్లు  రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగగలరు. ఆ తర్వాత వీళ్ళు ఎంత చేసిన ముందుకు వెళ్లడం కష్టం. ఎందుకంటే హీరోయిన్ గా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత ఏజ్ మీద పడుతూ ఉంటుంది. అలా ఏజ్ పెరిగితే వీరి బాడీ లాంగ్వేజ్ అప్పుడున్న యువతకు సెట్ కాదు అందుకే హీరోయిన్లు వస్తూ పోతూ ఉంటారు. 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  దాదాపు రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు.. మరి అలాంటి అనుష్క శెట్టిని సినిమా రంగంలోకి దించింది ఎవరు.. కెరియర్ ను మార్చిన సినిమా ఆ ఏంటి వివరాలు చూద్దాం.. అనుష్క సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు యోగ టీచర్ గా ఉండేది.. అలాంటి అనుష్కను  సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు పూరి జగన్నాథ్. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీ లోకి వచ్చి 20 ఏళ్లు గడిచింది.. అయితే ఈమె కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా విషయానికి వస్తే మాత్రం అరుంధతి. హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర చేసి అందరినీ మెప్పించింది. సెన్సేషనల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయిందని చెప్పవచ్చు..

అలా అరుంధతితో  ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించిన అనుష్క, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అలా అనుష్క ఈ చిత్రం తర్వాత  భాగమతి, బాహుబలి,రుద్రమదేవి, వేదం, పంచాక్షరి వంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రాల్లో నటించింది. లేడీ ఓరియంటెడ్ పాత్రలే కాకుండా హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇదే కాకుండా బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో  గుర్తింపు తెచ్చుకొని అదరహో అనిపించింది. ఇప్పటికీ రెండు దశాబ్దాలు దాటిన ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి ఈమె కెరియర్ ను మలుపు తిప్పింది మాత్రం అరుంధతి అని చెప్పవచ్చు. అయితే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సందర్భంగా మరోసారి అభిమానులు అరుంధతి సినిమాని గుర్తు చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: