కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మంది స్టార్ హీరోలా సినిమాల్లో నటించి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం అయిన వారు ఎంతో మంది ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే లయ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరో గా రూపొందిన తమ్ముడు మూవీ ద్వారా ఈ నటి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం అందుకోలేదు. దానితో రీ ఎంట్రీ ద్వారా లయ కు మంచి గుర్తింపు దక్కలేదు అని చెప్పచ్చు.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో  సంపాదించుకున్న జెనీలియా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయింది. తాజాగా ఈమె జూనియర్ అనే మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో జెనీలియాకు కూడా రీ ఎంట్రీ మూవీ ద్వారా అద్భుతమైన విజయం దక్కలేదు. ఇది ఇలా ఉంటే మరో సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా మరికొన్ని రోజుల్లో ఇవ్వబోతుంది. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ నటి మరెవరో కాదు రాశి. 

రాశి తన కెరియర్ బిగినింగ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఈమె సీరియల్స్ లో మాత్రం నటించింది. తాజాగా ఈమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈమె ఉసురే అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కానుంది. మరి రీ ఎంట్రీ తో రాశి మంచి విజయాన్ని అందుకుంటుందో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: