
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న 'అఖండ 2' సినిమా సెప్టెంబర్ 25న విడుదలయ్యేందుకు ముస్తాబు అవుతోంది. ఓ వైపు అఖండ 2 సినిమా షూటింగ్ ఇంకా శరవేగంగా జరుగుతోంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా - లెజెండ్ - అఖండ మూడు సినిమాలు ఒక దానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా అఖండ 2 - తాండవం. అందులోనూ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో పాటు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ అంతా సక్సెస్ కావడంతో అఖండ 2 మీద అంచనాలు అయితే మామూలుగా లేవు.
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తూ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం నదీ ప్రవాహం వద్ద కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య అంత వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్లి కూడా సీన్ కూడా డ్రోన్ ద్వారా సూపర్బ్ గా షూట్ చేసినట్టు తెలిస్తోంది. ఏదేమైనా అఖండ 2 షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తోంది. ఈ సినిమాకు ఎస్ . ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు