
బాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.ఈ రోజు 'వార్ 2' ట్రైలర్‌ను రిలీజ్ చేస్తుండటంతో అభిమానుల ఆతృత రెట్టింపయ్యింది. ఈ ట్రైలర్ ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ వర్గాల్లో ఇప్పటికే ఈ ట్రైలర్ చూసిన వారు పూనకాలు లోడ్ అవుతాయంటున్నారు. ట్రైలర్ పూర్తి యాక్షన్ ట్రీట్‌గా ఉండబోతుందని, ఇది మాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఫీస్ట్ అందిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య సాగే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడం ఖాయమని అంటున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా సినిమాలో కీలకమని తెలుస్తోంది. యాక్షన్, డ్రామా, మరియు గ్లామర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం, విజువల్‌గా మరియు కథాపరంగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు