
ప్రేమలోని విరహ వేదనను హృదయాన్ని తాకేలా రూపుదిద్దుతున్న ఈ పాటతో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ‘ఉప్పెన’లో కృతి శెట్టి పాత్రను ఎలా అందంగా ఆవిష్కరించాడో.. ఈ సినిమాలో జాన్వీ పాత్రను కూడా అంతే రొమాంటిక్ మూడ్‌లో తీసుకువెళ్తాడని టాక్. రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు రొమాంటిక్ విజన్, చరణ్-జాన్వీ జోడీ.. అన్నీ కలిసి ఈ మెలోడీ సాంగ్ సినిమాకే ప్రత్యేక హైలైట్ అవుతుందన్న భావన ఉంది. ఇప్పటికే రెహమాన్ ఈ పాటను చాలా కేర్‌తో కంపోజ్ చేశాడట. ప్రేమికుల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఈ గీతం ఉంటుందట. తెలుగు సినీ సంగీతంలో మరో మేజిక్ క్రియేట్ చేయబోతున్నాడన్న ఆసక్తికర అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో రెహమాన్ ఎందుకు ఒప్పుకున్నాడనే ఆసక్తికర అంశం గురించి మాట్లాడుకుంటే.. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ వినగానే రెహమాన్ ఆసక్తి చూపాడట. పర్సనల్‌గా కథ విన్న తరువాత ఆయన వెంటనే అంగీకరించారట. ముఖ్యంగా చరణ్ కోసం సంగీత పరంగా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని రెహమాన్ టార్గెట్ చేసుకున్నాడని సమాచారం.మొత్తానికి ‘పెద్ది’ మాస్ బాడీకి మెలోడీ హృదయం కట్టబెట్టిన సినిమా అవుతుందనడంలో సందేహమే లేదు. ఈ రొమాంటిక్ టచ్ సినిమాకి అదనపు బజ్ తీసుకురానుందన్నది మాత్రం పక్కా!