పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను మెప్పించింది. కానీ ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ టాక్ తో నిలిచింది. నిన్నటి రోజు కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఈ రోజున కలెక్షన్స్ భారీగా పెరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు చిత్రంలో కొన్ని సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు. VFX వళ్ల కూడా ఈ సినిమా కొంతమేరకు అభిమానులను నిరాశపరిచింది. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా నార్త్ లో డిజాస్టర్ గా మిగిలిందనే విధంగా వినిపిస్తున్నాయి.


హరిహర వీరమల్లు చిత్రానికి నార్తులో పెద్దగా ఆదరణ రాలేదని ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సినిమా మొదటిరోజు లక్ష రూపాయలు వసూలు చేస్తే రెండవ రోజు 30 వేల రూపాయలు మాత్రమే సాధించింది. దీంతో హరిహర వీరమల్ల చిత్రాన్ని  కొంతమంది సైతం చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీటికి తోడు త్రిభాషా విధానాన్ని కూడా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ పైన చాలామంది మండిపడుతున్నారు. అసలు కలెక్షన్స్ రేపటి రోజు నుంచి  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంటుందో అనేదాన్ని బట్టి సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందా ఉండదా అనే విషయం ఆధారపడి ఉంటుంది.


హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించిన ఇందులో ఇమెను చూపించే విధానం కూడా సరిగ్గా లేదని.. చివరిలో హరిహర వీరమల్లు 2 ఉంటుందనే విధంగా చిత్ర బృందం  చూపించారు. మరి అది ఎప్పుడో చూడాలి.మూడు రోజుల్లో కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.65.88 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విషయానికి వస్తే రూ.91 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఈరోజు కూడా కలెక్షన్స్ ఇదే జోరు కొనసాగితే మాత్రం కచ్చితంగా నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: