ఫ్లాప్‌ల పరంపరతో వెనకబడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్డమ్’తో గ‌ట్టి కం బ్యాక్‌కు రెడీ అయిపోయాడు. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లోనే కాదు , ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్ల బాక్సాఫీస్ ఉత్సాహాన్ని తిరిగి రాబట్టే బాధ్యత ఇప్పుడు విజయ్ భుజాల పై పడింది. ఈ సినిమాకు ఓపెన్ గ్రౌండ్ లాంటి పంథా దొరికింది. వచ్చే రెండు వారాల్లో పెద్దగా పోటీ లేదు. కానీ ఆగస్ట్ 14 న 'కూలీ', 'వార్ 2' బాక్సాఫీస్‌కి దిగిపోతున్నాయి . అంటే అప్పటి వరకే ‘కింగ్డమ్’కి అసలైన ఆడిటోరియం. అందుకే ప్రమోషన్ల పరంగా ఒక్క అవకాశం కూడా వదలకుండా యూనిట్ ఫుల్ ప్లాన్‌తో వెళ్తోంది.


సోమవారం యూసుఫ్ గూడలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ హైప్ మరింత పెరిగేలా చూస్తోంది . థియేటర్ బిజినెస్ పక్కా ప్లాన్ : సుమారు రూ.100 కోట్ల గ్రాస్ లక్ష్యంతో కింగ్డమ్ బరిలోకి దిగుతోంది. అంటే బ్రేక్ ఈవెన్‌కి కనీసం రూ. 55 కోట్ల రేంజ్‌లో షేర్ రావాల్సిందే . వివిధ ప్రాంతాల్లో జరిగే బిజినెస్ ఇలా ఉంది: నైజాం 15 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు 3.5 కోట్లు, ఓవర్సీస్ 10 కోట్లు, ఇతర డబ్బింగ్ వెర్షన్లు 4 కోట్ల దాకా డీల్స్ జరిగినట్టు ట్రేడ్ టాక్ . ఇవి బేస్ చేసుకుని చూస్తే, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ‘కింగ్డమ్’కు వంద కోట్లు అందుకోలేని లక్ష్యం కాదు ! ట్రైలర్‌తో బజ్.. టాక్‌నే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ..  గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం…


 ‘కెజిఎఫ్’ స్థాయిలో ఎలివేషన్‌, యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండిపోయిందన్న సంకేతాలు ట్రైలర్ నుంచే వచ్చాయి. దీనితో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు బాగా పెరిగాయి. అభిమానుల్లో కాన్ఫిడెన్స్ కూడా తారాస్థాయికి చేరింది. అయితే బుధవారం ప్రీమియర్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ముందస్తుగా షోలు వేస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందన్న అనుభవం నేపథ్యంలో టీమ్ ఈ విషయాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తోంది . ఫైనల్ గేమ్ విజయ్ చేతిలో! ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఇదే కీ రీలీజ్. బాక్సాఫీస్‌కి తన మార్క్ తిరిగి గుర్తించాల్సిన టైం ఇది. అభిమానుల నుంచి మద్దతు, కంటెంట్ పక్కా ఉంటే... ‘కింగ్డమ్’ విజయ్ కెరీర్‌లో మళ్లీ పిక్కెత్తే స్టేజీగా నిలవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: