ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో వార్2, కూలీ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే వార్2, కూలీ సినిమాలపై వర్షాల దెబ్బ ఊహించని స్థాయిలో పడే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వార్2 మూవీ బుకింగ్స్ తో పోల్చి చూస్తే కూలీ మూవీ బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయనే సంగతి తెలిసిందే. వార్2 మూవీ బుక్ మై షో బుకింగ్స్ 4 లక్షలకు అటుఇటుగా ఉంటే కూలీ సినిమా బుక్ మై షో బుకింగ్స్ 1.8 మిలియన్లుగా ఉన్నాయి.

వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృషించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మాత్రమే   ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సెలవులను ప్రకటించగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. వార్2, కూలీ సినిమాలపై అంచనాలు మాత్రం మాములుగా లేవని చెప్పవచ్చు.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. కూలీ సినిమాతో పోల్చి చుస్తే వార్2 సినిమా టార్గెట్ భారీ టార్గెట్ అని చెప్పవచ్చు.

వార్2, కూలీ సినిమాలు నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేసి హీరోల అభిమానులకు  సంతోషాన్ని మిగల్చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వార్2 సినిమా సక్సెస్ సాధించడం యశ్  రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ కు కీలకమనే సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ సినిమాలు ప్రతిసారి నందమూరి హీరోల సినిమాలకు పోటీగా రిలీజవుతున్నాయి. టాక్ ఆధారంగా ఈ సినిమాల బుకింగ్స్ లో మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సినిమాల కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: