
టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ గా పేరు పొందిన వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రంలో నటించిన నటి నైనా గంగోలి. ఆ తర్వాత చరిత్రహిన్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఆ తర్వాత డేంజరస్ వంటి చిత్రాలలో కూడా నటించిన గంగోలి ఇటీవలే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన ప్రియుడు చేతిలో తాను చాలా నరకాన్ని చూశానని.. అతడు తనని రోజు కొట్టడం, బెదిరించడం చేసే వారిని అది ప్రేమ కాదు ఒక హింస అంటూ తెలియజేసింది.
అలా హింసించడం వల్లే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపింది. కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్న తన ప్రియుడు తనను లైంగికంగా వేధించే వారిని ప్రతినిమిషాన్ని కూడా భయపడుతూ జీవించేదాన్ని .. ఇది నా జీవితాన్ని నాశనం చేసిందని ఎమోషనల్ గా మాట్లాడింది. ఇప్పుడు తనని వదిలేసి..తాను దృఢంగా మారిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టానని తెలిపింది..మహిళలు ఇలాంటి సంబంధాలు వదులుకోవడమే మంచిదంటూ తెలిపింది.. నా కెరియర్లో పడిన ఒక పెద్ద దెబ్బ ఇదే అంటూ నైనా గంగోలి తెలియజేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.