సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన మూవీ లో మరొకరు నటించడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇక ఒక రిజెక్ట్ చేసిన మూవీ లో మరొకరు నటించిన సందర్భంలో ఆ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే ఆ మూవీ ని ఎందుకు వదిలేసామా అని నటీ నటులు ఫీల్ కావడం , అదే వారు రిజెక్ట్ చేసిన సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయినట్లయితే ఆ మూవీ ని ఆ రోజు రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేసాం అని ఆనంద పడటం జరగడం కూడా చాలా కామన్ గా జరిగే  విషయం. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీ మణులు అయినటువంటి కాజల్ అగర్వాల్ , త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ తెలుగు సినీ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

ఒకానొక సందర్భంలో కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన మూవీ లో త్రిష హీరోయిన్గా నటించినట్లు తెలుస్తోంది. ఇక కాజల్ రిజక్ట్ చేసిన మూవీ లో త్రిష హీరోయిన్గా నటించగా ... ఆ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం నందమూరి నట సింహం బాలకృష్ణ "లయన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సత్యదేవ్ దర్శకత్వం వహించాడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మొదట త్రిష ను కాకుండా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్గా తీసుకోవాలి అని అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను కలిసి ఆమెకు సినిమా కథను కూడా వివరించారట  కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత త్రిష ను సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. ఇక కాజల్ రిజక్ట్ చేసిన పాత్రలో త్రిష హీరోయిన్గా నటించగా ఈ మూవీ ఫ్లాప్ అయినట్లు ఈ సినిమా ద్వారా త్రిష కు అపజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: