నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించాడు. బాలకృష్ణమూవీ లో ఒక పాత్రలో రైతుగా , మరొక పాత్రలో అఘోరాగా నటించాడు. బాలకృష్ణ తన కెరీయర్లో మొట్ట మొదటి సారి అగోరా పాత్రలో నటించడంతో ఈ సినిమాలోని బాలకృష్ణ అగోరా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.

ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే అఖండ 2 మూవీ లో బాలయ్య అగోర పాత్ర అఖండ సినిమాతో పోలిస్తే మరింత గొప్పగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో దైవత్వంతో కూడిన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వస్తున్న విషయం మనకు తెలిసిందే.

అఖండ 2 మూవీ లో కూడా దైవత్వం కు సంబంధించిన చాలా సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని దైవత్వంకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: