తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీ లో నటుడిగా , దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. కొంత కాలం క్రితం ఈయన హీరో గా నటించి , దర్శకత్వం వహించిన లవ్ టుడే అనే సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ కి తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన నటించిన డ్రాగన్ అనే మూవీ ని కూడా తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. దానితో తెలుగు సినీ పరిశ్రమలో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. తాజాగా ఈయన డ్యూడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. కొంత మంది ఈ సినిమా ఎప్పుడు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా డ్యూడ్ మూవీ ఓ టి టి ఎంట్రీ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ వారు దక్కించుకున్నట్లు అందులో భాగంగా నవంబర్ 14 వ తేదీ నుండి ఈ సినిమాను తమిళ్ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషలో  నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: