ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపాసన కొణిదెల రెండో ప్రెగ్నెన్సీ వార్తే చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా ఉపాసన ఎప్పుడు మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతుందా అనే ఆతృతతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ ఆసక్తికరమైన ఎదురు చూపులకు నిన్న ఆమె ముగింపు పలికింది.రీసెంట్‌గా ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేస్తూ, తన జీవితంలో మరో సంతోషకరమైన అధ్యాయం మొదలవుతోందని తెలిపింది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ “మెగా కోడలు మరోసారి తల్లి కాబోతుంది” అన్న ఆనందం హైలెట్ గా మారింది.

కేవలం ఒక బేబీ కాదు.. కవలలు!

కానీ ఇంతటితో కథ ముగియలేదు. ఆ వార్తను మించిపోయే సర్‌ప్రైజ్ ఒకటి బయటపడింది. తాజా సమాచారం ప్రకారం, ఉపాసన ఈసారి ఒక బిడ్డకే కాదు — కవలలకు జన్మనివ్వబోతుంది! అంటే రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఒకేసారి ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు కానున్నారు.ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభ కామినేని సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో,“వచ్చే సంవత్సరం నాకు ఐదుగురు మనవలు/మనవరాళ్లు ఉండబోతున్నారు. మా కుటుంబానికి డబుల్ ఆనందం రానుంది. రామ్ చరణ్ – ఉపాసన తమ లైఫ్‌లో ఇద్దరు చిన్నారులను వెల్కమ్ చేసుకోబోతున్నారు.”
అని రాసుకొచ్చారు".

మెగా ఫ్యామిలీ ఆనందం డబుల్!

ఈ పోస్టుతో సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులు సంతోషంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. “చెర్రీకి కవలలు వస్తున్నారా!”, “చిరంజీవిగారికి  రెండు మనవళ్లు!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.ఇక మెగా ఫ్యామిలీ కూడా ఈ సంతోషాన్ని మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ ఎప్పుడూ లాగే ఎంతో గ్రేస్‌ఫుల్‌గా, సింపుల్‌గా ఈ కొత్త ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న “మెగా ట్విన్స్”:

#MegaTwins, #UpasanaPregnancy, #RamCharanDaddyAgain వంటి హ్యాష్‌ట్యాగ్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు డబుల్ హ్యాపీనెస్ పోస్టులతో సోషల్ మీడియాలో ఫీడ్‌లను నింపేస్తున్నారు.మరి, మెగా ఫ్యామిలీకి, అభిమానులకి, ఉపాసనరామ్ చరణ్ దంపతులకి ఇది మరొక గుర్తుంచుకోదగ్గ పేజీ. 2026లో “మెగా ట్విన్స్” ఎంట్రీతో మెగా ఇంట్లో నవ్వులు, సంతోషాలు మరింత రెట్టింపవుతాయనే చెప్పాలి. అయితే కొంతమంది మాత్రం ఇలా ట్విన్స్ పుట్టాలి అంటే మందులు వాడుతారని..వీళ్లు అలా మందులు వాడే ట్విన్స్ ని ప్లాన్ చేశారా..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: