రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. ఆయన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే కోట్లు కుమ్మరిస్తారు.ఓ యాడ్ లో ఇలా కనిపించి అలా వెళ్ళిపోతే కోట్లు కుమ్మరిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ ఒక్క రీజన్ తో ఏడాదికి వందల కోట్లు వదిలేసుకుంటున్నారట.. అయితే ఇది ఒకరకంగా షాకింగ్ అనిపించినప్పటికీ ఆయన కి సినిమా పైన ఉన్న డెడికేషన్ ముందు తక్కువే అనుకోవచ్చు.మరి ప్రభాస్ ఎందుకు వందల కోట్ల ఆదాయాన్ని వదులుకుంటున్నారు. ఏ విషయంలో ఆయన వెనకడుగు వేస్తున్నారు. దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో ఏడాదికి సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని సంపాదించవచ్చు. అది కూడా యాడ్స్ ద్వారా.. చాలామంది స్టార్ హీరోల సినిమాలు హిట్ అయితే ఆ తర్వాత వెంటనే రెండు మూడు యాడ్స్ లో నటించడానికి ఒప్పుకుంటారు.అలా ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్,మహేష్ బాబు లాంటి హీరోలు పలు యాడ్స్ చేస్తూ భారీగా ఆదాయం సంపాదించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

 కానీ ప్రభాస్ మాత్రం ఒక్క యాడ్ లో కూడా నటించరు. దానికి కారణం ఆయన యాడ్ కోసం తన సినిమాలోని లుక్ ని మార్చుకోవాల్సి వస్తుంది అనే ఒకే ఒక్క రీజన్ తో యాడ్స్ లో నటించడానికి ఒప్పుకోవడం లేదట. అలా అని ప్రకటనలు చేయడానికి ఆయన వ్యతిరేకం ఏమీ కాదట. కానీ యాడ్ కోసం లుక్ చేంజ్ చేసుకుంటే సినిమాకి మైనస్ అవుతుంది అని రీజన్ తో ఆయన యాడ్ లు చేయడం లేదట. ఆయన సినిమా హిట్ అయిన హిట్ కాకపోయినా ఎన్నో బ్రాండ్ ఎంబార్స్మెంట్ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి యాడ్ చేయమని అడుగుతారట. కోట్లు ఇస్తామని చెప్పిన కూడా ప్రభాస్ చేయడం లేదట. అలా సినిమాకి నష్టం వస్తుందనే కారణంతో ఆయన ఎన్నో యాడ్స్ ని వదిలేసుకున్నారట. ముఖ్యంగా ఒక్క బాహుబలి సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన దగ్గరికి ఏకంగా 80 కోట్ల ఖరీదు చేసే ప్రకటనలు వచ్చాయట.

 కానీ ప్రభాస్ మాత్రం వాటిని వదిలేసుకున్నారట. ఇక రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చెబుతూ బాహుబలి సినిమా సమయంలో నా ముందే 10 కోట్ల యాడ్ ని వదిలేసుకున్నారు అంటూ స్వయంగా చెప్పారు.. అలా చాలామంది హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తుంటే ప్రభాస్ మాత్రం కేవలం సినిమా రెమ్యూనరేషన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఓ మూడు రోజుల సమయం కేటాయిస్తే ఒక ప్రకటనకు 25 కోట్లు వస్తాయని ఓ సెలబ్రిటీ మేనేజర్ చెప్పారు. కానీ ప్రభాస్ తన కి అభిమానులకి మధ్య ఉన్న బాండింగ్ అలాగే ఉండాలని తన విలువలకు అనుగుణంగా ఉండే యాడ్ ప్రకటనలు మాత్రమే ఎంచుకుంటారట. ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని, ఆచి తూచి అడుగులు వేస్తారని తెలిపారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఒక మొబైల్, కంపెనీకి,ఒక వాహన కంపెనీకి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అలా సినిమాలకి నష్టం రాకూడదనే కారణంతో పాటు ప్రేక్షకులకు తనతో ఉన్న బాండింగ్ చెడిపోకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ఏకంగా ఏడాదికి వందల కోట్లు వదిలేసుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: