పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి గా కొనసాగుతున్న విషయం మన అందరికి తెలిసిందే. పవన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి గా నియమితుడు అయిన తర్వాత నుండి ఆయన ఎన్నో విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ వస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు , జనసేన అభిమానులు కూడా పవన్ నుండి ఈ రేంజ్ పరిపాలన రావడంతో ఎంతో ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్ కొన్ని సమయాలలో తన మంత్రిత్వ శాఖకు సంబంధించని విషయాలపై కూడా తనదైన రీతిలో స్పందిస్తూ ఉండడంతో పవన్ అద్భుతమైన లీడర్ అని ఆయనపై ప్రశంసలు వర్షం కురిసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పేకాటక క్లబ్ లను విచ్చలవిడిగా నడపబడుతున్నాయి అని , వాటి విషయంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని తనదైన రీతిలో స్పందించాడు. అలాగే పవన్ కళ్యాణ్ డిఎస్పి జై సూర్య పై పేకాట క్లబ్బులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానితో కూటమి నాయకులలో ఒకరు అయినటువంటి రఘు రామ కృష్ణం రాజు అతని సపోర్టుగా నిలిచాడు. అతను మంచివాడే అని చెప్పాడు. దానితో కొంత మంది అనేక వ్యాఖ్యలు చేయడంతో రఘు రామ కృష్ణం రాజు నేను డిఎస్పీ జై సూర్య మంచివాడు అని సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ... కానీ నాకు తెలిసినంతవరకు ఆయన మంచివాడు... ఆయన మంచి ఆఫీసర్ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా రఘు రామ కృష్ణం రాజు కు మరో  నాయకుడు సపోర్టుగా నిలిచారు.

మాజీ ఎమ్మెల్యే గంది శ్రీనివాస్ , డీఎస్పీ జై సూర్య మంచి వారు అని , పవన్ కళ్యాణ్ ను కలిసి అసలు విషయాలు ఆయనకు వివరిస్తాను అని ఆయన చెప్పుకొచ్చాడు. భీమవరంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలల పాటు పేకాట క్లబ్లు నడిచాయి రెండు. నెలల క్రితం డిఎస్పి సూర్య వాటిని ఆపాడు. దానితోనే ఆయనపై కక్ష కట్టి కొందరు అతని టార్గెట్ చేస్తున్నారు అని , అన్ని విషయాలు మరి కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు వివరిస్తాను అని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: