భారత్-చైనా విషయంలో ఎప్పటినుంచొ విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలు కూడా కయ్యానికి కాలుదువ్వే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు భారత్ విషయంలో చైనా కాస్త వెనక్కు తగ్గే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అమెరికాతో భారత్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. భారత్ తో సంబంధాలు కొనసాగించడానికి అమెరికా, అమెరికా మిత్రపక్షాలు కూడా కాస్త ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. మిత్ర దేశాల విషయంలో భారత్ చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటుంది.

అయితే కొన్ని కొన్ని అంశాలను అంచనా వేయలేక పోతుంది చైనా అనే భావన కూడా ఉంది. సైనిక రంగంలో భారత్ కు అమెరికా నుంచి ముందు నుంచి కూడా పూర్తిస్థాయిలో సహాయసహకారాలు వస్తున్నాయి. త్వరలో భారత్ అమెరికాల మధ్య ఒక కీలక ఒప్పందం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చైనా భారత్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందని సమాచారం. పాకిస్తాన్ తో స్నేహం చేస్తూనే ఇప్పుడు భారత్ ను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

వాస్తవానికి భారత్ లో చైనాకు అతిపెద్ద మార్కెట్ ఉంది. వాళ్లకు వచ్చే ఆదాయంలో దాదాపు 30 శాతం భారత్ నుంచి వెళుతూ ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. ఇక భారతీయ కంపెనీలు చైనాలో కంటే కూడా కంపెనీలు భారత్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో చైనా భారత్ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్, చైనాను దూరం చేసుకుంటే ఆర్థికంగా దేశానికి ఇబ్బందులు ఉండవచ్చు. రష్యా కూడా చైనాకు దూరం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఆ దేశ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి మోడీ తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. కొన్ని కీలక ఒప్పందాలు కూడా జరగవచ్చు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: