రోజులు మారుతున్న కొద్దీ  టెక్నాలజీ లో ఊహించని రేంజి లో మార్పులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా వస్తున్న మార్పులు ఎన్నో అద్భుతాలకు కారణ మవుతున్నాయి. ఇక అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ అందుబాటు లోకి రావడం తో సరి కొత్త పద్ధతులు  అమలు లోకి వస్తున్నాయి. అయితే విద్యుత్ ఉత్పత్తి విషయం లో కూడా ఇప్పుడు ఎన్నో మార్గాలు అందు బాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు బొగ్గు ద్వారా మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసేవారు.


 ఇక ఆ తర్వాత కాలం లో టెక్నాలజీ లో మార్పులు వచ్చి నీటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుత కాలం లో అటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా పెరిగి పోయింది. సూర్య రశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఇప్పుడు  టెక్నాలజీ  మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో ఇక విద్యుత్ ఉత్పత్తి లో కొత్త మార్గాల ను ప్రారంభిస్తున్నారు శాస్త్ర వేత్తలు. ముఖ్యం గా అణు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వల్ల ఎంతో ఖర్చు తగ్గించాలనే ఉద్దేశం తో ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.



 ఈ క్రమం లోనే ఇలాంటి ఒక ప్రయోగం ఇప్పుడు సక్సెస్ అయింది అన్నది తెలుస్తుంది. ఇటీవలే బ్రిటిష్ సైంటిస్టులు ఇలాంటి ప్రయోగం లో విజయం సాధించారు. మొన్నటి వరకు కేవలం అణు ఆధారిత విద్యుత్ కనుగొన్న శాస్త్ర వేత్తలు ఇప్పుడు ఉపయోగించిన అణువులనే మళ్ళీ తిరిగి ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది అనే విషయాన్ని కనుగొన్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తం గా విద్యుత్ ఉత్పత్తి ధరలు ఒక్క సారిగా తగ్గి పోయే అవకాశం ఉంది. ఇక ఇది భవిష్యత్తుకు ఒక ఆశాజనకం గా ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: