ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయని ఇప్పటికే ప్రజలు , రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. ఇందుకు కారణం అధికారంలో ఉన్న వైసీపీ చేసిన కొన్ని పొరపాట్లే అని తెలిసిందే. అయితే మళ్ళీ ఇంకో అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కాలంటే ఎన్నికల మానిఫెస్టోలో అభివృద్ధికి సంబంధించిన అంశాలను పొందుపరచాలి. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా రాజకీయాలు జగన్ కు పెనుసవాలుగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట లాంటిది అని గత ఎన్నికలు నిరూపించాయి. కానీ వచ్చే ఎన్నికలకు పరిస్థితి ఇంకా దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారు... వారిలో ఒకరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాగా, మరొకరు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి... ఇద్దరూ కూడా టీడీపీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఆనం కు మాత్రం లైన్ క్లియర్ కాగా , కోటంరెడ్డి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. టీడీపీ లోకి రావడానికి తెలుగు తమ్ముళ్లకు ఇష్టం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వీరి కోరిక మేరకు చంద్రబాబు సైతం కోటంరెడ్డికి నో చెప్పినట్లు టాక్. అందుకే కోటంరెడ్డిపార్టీ నుండి ఎన్నికలకు వెళ్లనున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.

ఇక రూరల్ వైసీపీ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కోటంరెడ్డి ని ఎదిరించి గెలిచే అంత ప్రజాభిమానం ఆదాలకు ఉందా అంటే కాస్త అనుమానమే అని చెప్పాలి. ఎన్నికలకు ఎంత డబ్బు అయినా పంచే సత్తా ఆదాలకు ఉన్నా ... కోటంరెడ్డికి ఉన్న ప్రజాభిమానం ఆదాలకు లేదు. పైగా నిత్యం ప్రజలలో ఉండే కోటంరెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆదాల ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రజలలో ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని కోటంరెడ్డి పై ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు సాధ్యం అవుతుందా అన్న ప్రశ్న ప్రజలలో వినిపిస్తోంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏమి జరగనుంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: