ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూస్తుండగానే ఎమ్మెల్యే అనుచరుడు ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. రేషన్ దుకాణాల కేటాయింపుల్లో భాగంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ముందుగా చిన్న గొడవగా మొదలై మాటల యుద్ధం అది చిన్నగా ఆ గొడవ మొదలై చివరికి హత్యకు దారితీసింది. ఇందులో భాగంగానే జయప్రకాష్ అనే వ్యక్తి పై బిజెపి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు దాడికి పాల్పడ్డాడు. ఆయన పేరు వీరేంద్ర సింగ్. అయితే అధికారులు వేదికపై ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...


బల్లిలా మండలంలోని తుల్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపులో భాగంగా  అధికారులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోగా.. ఆ సందర్భంగా హాజరైన జయ ప్రకాష్, వీరేంద్ర సింగ్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇందులో భాగంగానే వీరేంద్ర తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో జయప్రకాష్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దేవేంద్రనాథ్ తెలియజేశారు. హత్య జరిగే సమయానికి అధికారులు, అలాగే పోలీసులు అక్కడే ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితుడు బల్లిలా  ప్రాంతానికి బిజెపి ఎక్స్- సర్వీస్మెన్ విభాగం అధ్యక్షుడుగా ఉన్నట్లు ఆ ప్రాంత ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తెలిపారు

ఈ విషయంలో చనిపోయిన వ్యక్తి సోదరుడు ఫిర్యాదుతో 15నుంచి 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో విడ్డూరం ఏమిటంటే ఇంత వరకు అక్కడ ఎవరిని అరెస్టు చేయకపోవడమే. అయితే అక్కడ కాల్పులు జరిగిన సంఘటన తర్వాత అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. ఇందులో భాగంగా తొక్కిసలాటకు గురయ్యారు. భారీగా జనం గుమిగూడి ఉండగా నిందితుడు మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరపగా అక్కడ ఉన్న జనం మొత్తం తోపులాటకు జరిగింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం సంబంధించి అక్కడ ఏ అధికారులు ఉన్నారో వారందరి పై తక్షణ చర్యలు తీసుకోవాలని హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: