హైదరాబాద్: టీపీపీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపణలపై టీఆర్‌ఎస్ మండిపడింది. తమపై కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలను ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. నిబంధనల ప్రకారమే ఓటు బదలాయింపు జరిగిందని అందులో ఎలాంటి ప్రజాస్వామ్య ధిక్కరణలూ లేవని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనలను అనుసరించి ముందుగానే  తమ ఎమ్మెల్సీ కవిత.. తన భర్తతో పాటు హైదరాబాద్‌కు ఓటు బదలాయించుకున్నారని, ఆ తరువాతనే ఇక్కడ ఓటు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చారు.

కవితకు, ఆమె భర్తకు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్ గ్రామ పరిధిలో ఓటు హక్కు ఉండేదని, అయితే ఇప్పుడు అక్కడ ఆమెకు ఓటు లేదని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. తన ఓటు హక్కుతో పాటు ఆమె భర్త ఓటును కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలంటూ అక్కడి ఈవోకు కవిత దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ కూడా పూర్తయిందని, అందువల్లే కవిత హైదరాబాద్‌లో ఓటు వేయగలిగారని, ఇందులో ప్రజాస్వామ్య ఉల్లంఘనకు తావే లేదని వెల్లడించారు.

కవిత రెండు ఓట్లు వేయడాన్ని స్థానిక ఈవో కూడా సమర్థించారు. ఖైరతాబాద్ ఈవో నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పొతంగల్‌లో ఉన్న కవిత ఓటును ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించడం జరిగిందని బోధన్ ఈవో రాజేశ్వర్ తెలిపారు. అయితే ఈ బదలాయింపు నేషనల్ సర్వీసు ఓటర్ల లిస్టులో కనిపించేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందని, అప్పుడు ఎన్‌ఎస్‌ఓ జాబితాలో కనిపిస్తుందని ఆవో రాజేశ్వర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత తక్కువ ఓటింగ్ సోమవారం నమోదైంది. కేవలం 36 శాతానికి పైగా మాత్రమే ఓటింగ్ నమోదవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే వరుస సెలవులు, కరోనా భయం నేపథ్యంలోనే ప్రజలు ఓటింగ్‌పై ఆసక్తి చూపలేదనే వాదన కూడా ప్రస్తుతం నడుస్తోంది. మొత్తం 149 పోలింగ్ సెంటర్లలో పోలింగ్ సజీవుగా సాగింది. అయితే ఓల్డ్ మలక్‌పేటలో మాత్రం అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడం వల్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ స్వయంగా ప్రకటించింది. మొత్తం డివిజన్లకూ కలిపి డిసెంబరు 4వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం విజేతలను ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: