అప్పుడ‌ప్పుడు గుండె చ‌ప్పుడు : అంకెలు ... అప్ప‌గింత‌లు

ప‌రిమితి అంగీక‌రించ‌కున్నా, ప‌రిధి ఒప్పుకోకున్నా రాష్ట్రం అప్పులు తీసుకోవ‌డంలో ఎన్న‌డూ లేనంత వేగంగా ప‌నిచేస్తుంది. అం దుకు కార‌ణాలు వేర‌యిన‌ప్ప‌టికీ ముఖ్యంగా సంక్షేమ ప‌థ‌కాల భారం వ‌ల‌న ఇంత‌గా అప్పు పేరుకుపోవ‌డానికి కార‌ణం అని తెలు స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా రాజీప‌డ‌ని రాష్ట్రం రుణ ప‌రిధిని పెంపు చేయ‌మ‌ని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. అలానే 15 వ ఆర్థిక సం ఘంనూ విన్న‌విస్తోంది. ఆ మేర‌కు చేసిన అప్పు పోరుగు రాష్ట్రాలే విస్తుబోతున్నాయి. మ‌ళ్లీ ఒక‌టో తారీఖు ఏమౌతుంది? డబ్బు లు యాడ నుంచి వ‌స్త‌య్ ? ఒక ఆర్థిక సంవ‌త్సరానికి సుమారు యాభై వేల కోట్ల అప్పు..అంటే జ‌గ‌న్ స‌ర్కార్ దిగిపోయేనాటికి మ‌న అప్పు మ‌న ఊహ‌కు అంద‌నంత.. మ‌రో వైపు ఈ లెక్క‌లు ఎలా ఉన్నా టీడీపీ స‌ర్కారు త‌మ‌కు మూడు ల‌క్ష‌ల ఇర‌వై వేల కోట్ల రూపాయ‌ల అప్పు అందించి పోయింద‌ని వాపోతోంది వైసీపీ..అంటే ఎవ్వ‌రున్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు త‌ల‌కు మించిన భారం త‌ప్ప‌ద‌న్న‌దే తేలిపోయింది.


మీరు విన్న‌ది నిజ‌మే..క‌రోనా కార‌ణంగానో మ‌రో కార‌ణంగానో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల వ‌ల‌లో చిక్కుకుంది. ఈ మాట కేంద్రం చెప్పింది. పార్లమెంట్ సాక్షిగా లిఖిత పూర్వ‌కంగా అప్పుల క‌హానీ ఏంట‌న్న‌ది విశదీక‌రించింది. దాదాపు యాభై వేల కోట్ల అప్పు 2020-21 సం వ‌త్స‌రానికి చేసింద‌ని, ఇది మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ‌ని తేల్చింది. రాజ్య‌స‌భ‌లో టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల అడి గిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఓ వైపు ఆదాయం ఏమీ లేక‌పో యినా ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ పేరుతోనూ, ఇత‌ర ఖ‌ర్చుల నెపంతోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ ఎన్న‌డూ లేనంత ఏ రాష్ట్ర‌మూ చేయ‌నంత అప్పు చేసింది..అని కేంద్రం వెల్ల‌డించింది. దీనిపై ఏపీ స‌ర్కార్ వివ‌ర‌ణ ఏంట‌న్న‌ది చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: