ఏపీలోని కీల‌క జిల్లా అయిన గుంటూరు జిల్లాలో విప‌క్ష టీడీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే ఫుల్ డిమాండ్ నెల‌కొంది. కీల‌క స్థానాల‌పై ప‌లువురు కీల‌క నేత‌లు క‌న్నేసి రాజ‌కీయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని ప్రాంతం అయిన అమ‌రావ‌తిలో విస్త‌రించి ఉన్న తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ టిక్కెట్ కోసం కొత్త నేత పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ నేత ఎవ‌రో కాదు జేఏసీ తో రాజ‌ధాని అమ‌రావ‌తి పోరాటంతో ఒక్క సారిగా వెలుగు లోకి వ‌చ్చిన కొలిక‌పూడి శ్రీనివాస‌రావు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొలిక‌పూడి అమ‌రావ‌తి ఉద్య‌మంలో గ‌ట్టిగా ఫైట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక ల‌లో ఆయ‌న తాడికొండ నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు జిల్లా లో ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు సైతం ఆయ‌న‌కు హామీ ఇచ్చార‌నే అంటున్నారు. గ‌త ఎన్నిక ల‌లో అక్క‌డ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్ర‌వ‌ణ్ కుమార్ ఓడిపోయారు. 2009 ఎన్నిక‌ల‌లో అక్క‌డ ఓడిన తెనాలి శ్ర‌వ‌ణ్ 2014లో గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌లో ఓడిపోయారు.

అయితే గ‌త ఎన్నిక ల వేళ ఆయ‌న్ను పార్టీ అధిష్టానం స్థానికంగా ఉన్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో బాప‌ట్ల పార్ల‌మెంటు కు పోటీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో పాటు అక్క‌డ సీటు ఇచ్చింది. బాప‌ట్ల ఎంపీ గా ఉన్న శ్రీరామ్ మాల్యాద్రిని తాడికొండ నుంచి పోటీ చేయాల‌ని చెప్ప‌డంతో పాటు సీటు కూడా కేటాయించింది. అయితే ఆ మ‌రుస‌టి రోజే తిరిగి శ్ర‌వ‌ణ్ కు తెనాలి సీటు ఇచ్చి.. తిరిగి మాల్యాద్రి ని బాప‌ట్ల పార్ల‌మెంటుకు పోటీ చేయాల‌ని సీటు కేటాయించింది. ఆ త‌ర్వాత శ్ర‌వ‌ణ్ కు గుంటూరు పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొలిక‌పూడి కోసం శ్ర‌వ‌ణ్‌ను ప్ర‌త్తిపాడు కు పంపుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: