తమిళ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమాని అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ఒక సామ్రాజ్యం ఉంటుంది. ఇక చుట్టుపక్కల గ్రామాల ప్రజలని కూడా బలవంతంగా అందులోకి  తీసుకు వెళ్తారు. ఇక ఆ సామ్రాజ్యం లోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ బానిసలుగా మారి పోవాల్సిందే.  ఎలా చెబితే అలా  నడుచుకోవాలి ఎవరైనా ఎదురుతిరిగితే దారుణంగా కాల్చి చంపడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత మనుషులు ఇంత క్రూరంగా కూడా ఉంటారా.. ఇంత నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తారా అని అందరూ అనుకుంటారు. కానీ ఉత్తర  కొరియాలో మాత్రం అధ్యక్షుడు కిమ్ జాంగ్ వ్యవహరించే తీరు చూసి.. ఇంతకంటే కేజిఎఫ్ సినిమానే బెటర్ అని అనుకుంటారు ప్రతి ఒక్కరు.


 ఆ రేంజ్  లో ప్రస్తుతం ఉత్తర  కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ప్రజల పట్ల నియంత పాలన సాగిస్తూ దారుణంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దేశం మొత్తం అతను చెప్పిందే వేదం. ప్రజలు ఎవరూ కూడా కనీసం ఎదురుతిరగరు. మాట్లాడటానికి కూడా ధైర్యం చేయరు. ఎవరైనా మాట్లాడితే ఆ తర్వాత రోజు నుంచి వారు కనిపించకుండా పోతారు. దేశ అధ్యక్షుడు తినమంటే  తినాలి లేకపోతే పస్తులు ఉండమంటే పస్తులు ఉండాలి. అంతే తప్ప ఎదురు తిరిగి మాట్లాడటం లాంటివి ఎక్కడ ఉండదు. అలాంటి నియంత కిమ్ ఇటీవల కాలంలో అగ్రరాజ్యమైన అమెరికా కు వరుస షాకులు ఇస్తున్నారు. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు బాలిస్టిక్ క్షిపణుల కు ప్రయోగాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవైపు దేశంలో ఆహార సంక్షోభం ఎదురవుతుంటే సహాయం చేయాలంటే ప్రపంచ దేశాలను కోరుతున్న కిమ్ జాంగ్ దేశంలో వరుసగా అణు క్షిపణులను మాత్రం ప్రయోగాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే మొదటి సారి ప్రయోగాలు నిర్వహించిన సమయంలో మరోసారి ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు అంటూ అగ్రరాజ్యమైన అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ వెనకడుగు వేయని కిమ్ రెండోసారి అణు క్షిపణులను ప్రయోగం చేయగా అమెరికా ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కిమ్ జాంగ్ తీరులో మాత్రం ఎక్కడా మార్పు రాలేదు. ఇప్పుడు మూడోసారి ఈ అణు క్షిపణులను ప్రయోగాలు నిర్వహించడం సంచలనంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim