మెక్‌డొనాల్డ్స్..ఈ పేరు అందరికి తెలిసే ఉంటుంది..
కెఎఫ్ సి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ఇదే. ఎన్నో కొత్త కొత్త వెరైటీ ఫుడ్ లను అందించి భోజన ప్రియులను ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గా దీనికి మంచి పేరు ఉంది.కాగా, ఈ మెక్‌డొనాల్డ్స్ రష్యాకు భారీ షాక్ ఇవ్వనుంది. మెక్‌డొనాల్డ్స్ రష్యాలో తన వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయబోతోంది.రష్యా వ్యాపారాన్ని విక్రయించే ప్రక్రియను ప్రారంభించినట్లు కంపెనీ సోమవారం తెలిపింది. రష్యాలో కంపెనీకి మొత్తం 850 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో 62,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


మెక్‌డొనాల్డ్స్ ఉక్రెయిన్ ఆక్రమణ అనంతరం రష్యా నుంచి వైదొలిగిన మరొక పశ్చిమ దేశాల మల్టీనేషనల్ కంపెనీ కావడం విశేషం. రష్యాలో మెక్‌డొనాల్డ్ వ్యాపారం చేయడం ఇకపై సరైనది కాదని తమ విలువలను తాము మర్చి పోలేదని చెప్పింది.చికాగోకు చెందిన మెక్‌డొనాల్డ్ కంపెనీ మార్చి ప్రారంభం లో రష్యాలోని తన దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది, అయితే ఉద్యోగులకు జీతాల చెల్లింపు కొనసాగుతుందని పేర్కొంది. అయితే రష్యాకు చెందిన కొత్త నిర్వాహకుల దొరికేవరకు కార్మికులను వేతనం చెల్లిస్తామని తెలిపింది. సంస్థ ఔట్ లెట్స్, వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టి కొత్త ఓనర్ కోసం అన్వేషిస్తున్నట్లు కంపెనీ ఈరోజు తెలిపింది.


రష్యాకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశం తో విధించిన ఆంక్షలు ఇప్పుడు అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, అమెరికా ఆంక్షల వల్ల రష్యా లోని శూన్యతను పూరించడానికి చైనా చాలా వేగంగా కృషి చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత, రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశ్యం తో అమెరికా అనేక ఆంక్షలు విధించింది. దీనితో పాటు, అనేక అమెరికన్ బహుళజాతి కంపెనీలు కూడా తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రష్యాలో తమ సేవలను నిలిపివేసాయి..రష్యా పై ఇప్పటికే కొన్ని కంపెనీలు రష్యాను బహిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: