
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కుల గణనపై కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు విమర్శలను ప్రజలు పట్టించుకోరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ గణన రాష్ట్రంలో 56.32 శాతం బీసీల ఉనికిని బయటపెట్టి, 42 శాతం రిజర్వేషన్లకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనలు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయానికి దారితీస్తున్నాయని, తెలంగాణ మోడల్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల విమర్శలను రాజకీయ ప్రేరితమని తోసిపుచ్చారు.
దేశవ్యాప్త కుల గణనలో మతాల ప్రస్తావన ఉండదని కిషన్ రెడ్డి చెప్పడం సమంజసం కాదని, అలాంటి విషయాలను మోదీ స్వయంగా స్పష్టం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ తీర్మానం గ్రామ పంచాయతీ నిర్ణయం కాదని, దీనిని తేలిగ్గా తీసుకోవడం సరికాదని విమర్శించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, అన్ని కులాల వారు భారత భూమి బిడ్డలని, వారి సంక్షేమానికి కుల గణన కీలకమని పేర్కొన్నారు. ఈ గణన ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు