పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన దాడులు విజయవంతం ఆయన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 100 మంది వరకు చనిపోయారని భారత ప్రభుత్వం ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ యుద్ధంలో చైనా రాడార్ ప్రదర్శన పై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చే తెర మీదకు వచ్చింది. పీవోకే తో పాటు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌ ప్రాంతంలోనూ భారత సైన్యం దాడులు చేసింది. అయితే ఈ వైమానిక దాడులను గుర్తించడంలో పాక్ వాడుతున్న చైనా రాడార్ల వ్యవస్థ పూర్తిగా విఫ‌ల‌మైందని అంటున్నారు. చైనా రాడార్ వ్యవస్థలతో పాక్‌ దెబ్బ తినటం ఇదే తొలిసారి కాదు .. 2019లో బాలాకోట్‌ వైమానిక దాడి సమయంలోనూ పాక్ రాడార్ వ్యవస్థ కవరేజ్ పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో చైనా నుంచి వాయు రక్షణ వ్యవస్థలను ఇస్లామాబాద్‌ అత్యవసరంగా కొనుగోలు చేసింది.


ఇస్లామాబాద్ 2022 మార్చ్ 9న హర్యానాలోని అంబాల నుంచి అనుకోకుండా సూపర్ సోనిక్ బ్రహ్మస్ ప్రయోగించడం జరిగింది. ఆ క్షిప‌ణి భారత గగనతలంలో 100 కిలోమీటర్లు ... పాకిస్తాన్ భూభాగంలో మరో 105 కిలోమీటర్ల ప్రయాణించి నేరుగా పంజాబ్ ప్రావిన్స్ లోని మియా చెన్నూ లో కూలిపోయింది. తమ భూభాగంలో సుమారు 105 కిలోమీటర్ల ప్రయాణించిన ఏ దశలోను పాకిస్తాన్ దీనిని గుర్తించలేదు. ఈ ఘటనపై పాక్ సైన్యం  ఎల్.వై-80 వ్యవస్థలోని 388 లోపాల జాబితాను చైనాకు అందజేసింది. అందులో 285 లోపాలు గతంలోనే గుర్తించ‌గా.. ఇప్పుడు మ‌రో 103 గుర్తించిన‌ట్టు స‌మాచారం. దీంతో పాక్ రాడార్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: