అసలు మాఫియా ఎలాంటిదో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కాం వెలుగులోకి తెప్పిస్తుందన్న చర్చలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అరెస్టు అయిన జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గతంలో గ్యాంగ్‌స్ట‌ర్లు అబూ సలేం - మౌనిక బేడీలకు తప్పుడు పేర్లతో పాస్‌పోర్ట్ ఇప్పించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అవుతారు. ఈ గ్యాంగ్ స్టార్ లవర్స్ ఇద్దరినీ గతంలో బలగాలు పట్టుకున్నప్పుడు వారి వద్ద పాస్పోర్టులు లభించాయి. ఆ ఫేక్ పాస్ పోర్టుల్లో అడ్రస్ కర్నూలు జిల్లా అని ఉంది. అక్కడ నుంచి తీగ లాగితే వారికి పాస్పోర్ట్ లు ఎలా వచ్చాయో ?బయటపడింది. కృష్ణమోహన్ రెడ్డి చాలామంది అనుకున్నట్టుగా ఐఏఎస్ కాదు ... ఆయన కేవలం ఎమ్మార్వో. కర్నూలు జిల్లాలో ఎమ్మార్వో గా పని చేస్తున్నప్పుడు అబూ సలీం , మౌనిక బేడీలకు వేరే పేర్లతో పాస్పోర్ట్ లో రావడంలో కీలకపాత్ర పోషించారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు వచ్చేలా చేశారు.


ఇవి వ్యవహారం అంతా ఆయన చేతుల మీదుగా సాగింది. అదే టైంలో పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగింది. అదంతా కర్నూలు ఎస్పీ నేతృత్వంలో సాగింది.. ఆ ఎస్పీ పిఎస్ఆర్ ఆంజనేయులు.. అంటే ఉద్దేశపూర్వకంగా తన అధికారాలను దుర్వినియోగించేసి గ్యాంగ్ స్టార్ కు ఫేక్ పాస్పోర్టు ఇప్పించి దేశం నుంచి పారిపోయేలా సహకరించారా ? అన్న విమర్శలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. వీరికి నేరుగా అబూసలేంతో సంబంధాలు ఉన్నాయా ? లేదా మౌనిక బేడితో సంబంధాలు ఉన్నాయా ? లేదా ఇంకెవరైనా మాఫియాలోని కీలక వ్యక్తుల కోసం సాయం చేశారా ? అన్నది తేలలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: