ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులను ఉద్దేశించి గత రెండు రోజుల నుంచి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అటు కూటమి నేతలలో ఏదో తెలియని భయం కూడా కనిపిస్తోందట.ఒకవేళ జగన్ మళ్ళీ సీఎం గా వస్తే తమ పరిస్థితి ఏంటో అంటూ చాలామంది ఊహించుకుంటున్నారు. బడా నాయకులే కాకుండా కింద నాయకులకు కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులే ఎదురవుతాయని ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా ప్రతి కారం తీర్చుకునే పని కూడా ఖర్చు లేకుండా ఉంటుంది. పైగా అధికారం చేతిలో ఉంటే ఏమైనా ప్రభుత్వం చేస్తుందని విధంగా వాడుకుంటున్నారట.



అంతేకాకుండా చంద్రబాబు చేస్తున్న పనిని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుమించి చేసి చూపిస్తానంటూ జగన్ ధీమాతో తెలియజేస్తున్నారు.2.O అన్నట్లుగా తెలుపుతున్నారు. తమ కార్యకర్తలను నేతలను ఇబ్బంది పెడుతున్న అధికారులను నేతల పేర్లను రాసి పెట్టుకోండి అధికారంలోకి వచ్చిన తరువాత సినిమా మామూలుగా ఉండదు అంటూ ఇటీవలే మీటింగ్లలో జగన్ తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ అధికారంలో ఉండే వాళ్ళ అంతు చూడడానికి ఎంతగా రగిలిపోతున్నారో చెప్పాల్సిన పని లేదంటూ చాలా మంది నేతలు మాట్లాడుకుంటున్నారట.


మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్యాయం చేసిన వారికి మీ చేతే న్యాయం చేపిస్తానని.. మనిషి రిటైర్డ్ అయిన దేశం వదిలిపోయిన సరే లాక్కొచ్చి మరి ఎవరిని వదిలిపెట్టకుండా సినిమా చూపిస్తానంటూ తీవ్రంగా ఆగ్రహంతో తెలిపారు జగన్. ఒకవేళ 2029లో కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అరెస్టు చేసిన అధికారులను, కూటమి నేతలకు జగన్ చెప్పినట్టుగా చేస్తారా లేదా చూడాలి మరి. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి వాటికి తాను ఎప్పుడూ కూడా స్థానం కనిపించలేదని.. అధికారాన్ని చూసి విర్రవీగుతున్న వారందరికీ కూడా తగిన గుణపాఠం జగన్ 2.O లో చెబుతారు అంటూ పదేపదే చెబుతున్నారు. దీంతో కొంతమంది అధికార  కార్యకర్తలు, అధికారులు, నేతలు కూడా భయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: