
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడంలో విఫలమవుతున్నారని కవిత విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా "జై తెలంగాణ" అని పలకని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమరవీరులకు నివాళులు అర్పించకపోవడం, రాజీవ్ గాంధీ పేరును యువ వికాస కార్యక్రమాలకు ఉపయోగించడం తెలంగాణ గొంతుకను అణచివేసే ప్రయత్నమని ఆమె ఆరోపించారు. పీవీ నరసింహారావు, కాళోజీ, బాపూజీ, శ్రీకాంతాచారి వంటి తెలంగాణ గొప్ప వ్యక్తుల పేర్లను ఈ కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల ద్వారా 200 టీఎంసీ నీటిని తీసుకెళ్తామని చెబుతుంటే, రేవంత్ రెడ్డి నిశ్శబ్దంగా ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని కవిత ఆరోపించారు. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎందుకు పనిచేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎనిమిది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం జాగృతి గట్టిగా పోరాడుతుందని, ఈ దిశగా మరింత విస్తరించి ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు