తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలిచేలా హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలు జరిగాయి. ఈ సంవత్సరం జరిగిన ఈ పోటీలలో థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా అవతరించారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 108 దేశాల అందాల ప్రతినిధుల మధ్య జరిగిన ఈ పోటీలో ఓపల్ తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే సమాధానాలతో అందరికీ ఆకర్షణీయంగా నిలిచింది. ఇందులో భాగంగా.. సోనూ సూద్ ప్రశ్నకు చక్కటి సమాధానం ఇచ్చింది ఓపల్ సుచాత. ప్రశ్నోత్తర రౌండ్‌లో ఓపల్‌ను నిర్వాహకుల్లో ఒకరైన సోనూ సూద్ అడిగారు. "ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది?" అని అడగగా.. దానికి ఓపల్ ఇచ్చిన సమాధానం ఆమె విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది.

“నా జీవితంలో ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. మిస్ వరల్డ్ అనేది ఒక గొప్ప బాధ్యత. ఎప్పుడైనా మనం చేసే పనులు మంచివై ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా.. మన పిల్లలు, చుట్టూ ఉన్నవాళ్లు లేదా పేరెంట్స్.. ఇలా ఎవరైనా మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ముఖ్యం.” అంటూ సమాధానమిచ్చింది. ఈ భావ ప్రధానత గల సమాధానం సుదీర్ఘ శిక్షణ, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిగత విలువల ప్రతిబింబంగా నిలిచింది. ఈసారి మిస్ వరల్డ్ 2025 పోటీ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఇది తొలిసారి భారత్ మిస్ వరల్డ్ వేదికగా మారిన సందర్భం కాదు గానీ, హైదరాబాద్‌కు ఇదే తొలి అవకాశం. నగరం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఈవెంట్ ద్వారా తన సౌలభ్యం, ఆధునిక వసతుల వల్ల ప్రత్యేకంగా నిలిచింది.

ఓపల్ సుచాత తన సమాధానంతో పాటు, సాంస్కృతిక ప్రదర్శన, సామాజిక సేవల పట్ల ఉన్న నిబద్ధత, మానవత్వాన్ని ఆధారంగా చేసుకున్న అభిప్రాయాలతో జడ్జీలను ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ప్రేరణగా నిలిచే స్థాయిలో ఆమెను బోర్డ్ ఎంపిక చేసింది. ఓపల్ విజయం ద్వారా థాయ్‌లాండ్ కు ఆరో సారి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. హైదరాబాదులో జరిగిన ఈ ఘనమైన ఈవెంట్‌తో పాటు ఓపల్ అందించిన సమాధానం, ఆమె వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం భారత్ యువతకు ప్రేరణగా నిలిచాయి. "మిస్ వరల్డ్" కేవలం అందానికి ప్రతీక కాదు... అది బాధ్యత, మానవత, ఆశయాల పట్ల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం అని ఓపల్ తన విజయంలో మరోసారి నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: