
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు .. ఈరోజు అమరావతి లో రఘురామకృష్ణంరాజు పర్యటించారు .. ఈ క్రమంలోనే ఆయన మీడియా తో మాట్లాడుతూ .. తెనాలి లో గంజాయి బ్యాచ్ ను పరామర్శించడాని కి వెళ్లిన మాజీ సీఎం జగన్ రాజకీయం గా తనకు తానే ఆత్మహత్య కు పాల్పడ్డారని రఘురామ ఆరోపణలు చేశారు .. అలాగే రాజకీయాల్లో ఆత్మహత్య తప్ప హత్యలు ఉండవు అనే సామెత జగన్ లాంటి వారిని చూసే పెద్దలు పెట్టి ఉంటారని ఆయన విమర్శలు చేశారు .. అలాగే పోలీసుల పై హత్యయత్నం చేసిన గంజాయి బ్యాచ్ కు జగన్ అండగా తోడుడగా ఉండాలా ? అని ఆయన ప్రశ్నించారు ..
అలాగే గంజాయి బ్యాచ్ కు జగన్ సానుభూతి పలకటం అత్యంత బాధాకరమని కూడా అన్నారు .. గతంలో ఎంపీ గా ఉన్నప్పుడు సునీల్ కుమార్ తో నన్ను కస్టడీ లో కొట్టించింది కూడా జగనే అని రఘురామా మరోసారి చెప్పుకొచ్చారు .. అరాచకాలు చేసిన వారికి జగన్ సపోర్టుగా ఉండటం అత్యంత దారుణమని కూడా అన్నారు .. ఈ క్రమం లోనే గతంలో డాక్టర్ సుధాకర్ ను వైఎస్ జగన్ ఎందుకు పరామర్శించ లేదని కూడా ఆయన ప్రశ్నించారు .. అయితే రేపు వైసిపి వెన్నుపోటు దినోత్సవం .. తమ కు ఓటేయని ప్రజలపై చేస్తుందని .. రఘురామా జగన్ పై తన స్టైల్లో విరుచుకుపడ్డారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు