
ఒకే ఒక్క ఓటమి వైసీపీని పాతళానికి తొక్కేసింది. గత ఏడాది పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి కంచుకోటలో అనుకున్న జిల్లాలలో కూడా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు వైసీపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ ఓడిపోయిన 2014 ఎన్నికలలో కూడా నెల్లూరు ఎంపీ సీటుతో పాటు ఏకంగా ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచిన జిల్లా అది. అలాంటిది ఇప్పుడు జిల్లాలో ఒక్క నేత కూడా యాక్టివ్ గా లేరు .. అందరూ సైలెంట్ అయిపోయారు. గతంలో ప్రెస్మీట్లో పెట్టే కాకాణి గోవర్ధన్ రెడ్డి మూడు నెలల పాటు పరారీలో ఉండి ఇప్పుడు జైలుకు వెళ్లారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు అస్సలు మాట్లాడటం లేదు. కేడర్లో తీవ్ర నిరాశ .. నిస్పృహ కనిపిస్తోంది. జగనన్న మాకు దిక్కు ఎవరు ? అని ప్లెక్సీలు వేస్తున్నారు. కావలి నియోజకవర్గం లో పెద్ద ఎత్తున ఇలాంటి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.
అక్కడ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కేడర్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని వాడుకుని ఇప్పుడు పార్టీ ఓడిపోయాక రోడ్డున పడేసి పోయారని ఆరోపిస్తున్నారు. వారంతా కలిసి తమ దారి తాము చూస్తూనే పనిలో ఉన్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసిపి చాలా బలంగా ఉండేది. 2019లో జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకున్నారు. మేకపాటి , ఆనం , అనిల్ కుమార్ , కోటంరెడ్డి , కాకాణి ఇలా అందరూ బలమైన లీడర్లు ఉండేవారు. కానీ 2025 కి వచ్చేసరికి మొత్తం తేడా వచ్చేసింది. ఒక్క సీటు గెలవలేదు .. ఒక్క నాయకుడు గెలవలేదు .. చివరికి మాకు దిక్కెవరు అని పార్టీ కేడర్ పోస్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు