- ( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పలు నియోజకవర్గం నియోజకవర్గాలలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసిపి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు తో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం వైసీపీకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వైసిపి నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో కూడా కొందరు పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే వైసీపీలో ఎమ్మెల్యేకు వైసీపీలో ఉన్న మాజీ మంత్రి నుంచి తీవ్ర ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతున్నాయి.


గత ఎన్నికలలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న పార్టీ త‌ర‌పున మీడియాలో బ‌లంగా వాయిస్ వినిపిస్తున్నారు. అయితే గతంలో అక్కడ వైసిపి నుంచి ప్రాథినిత్యం వహించిన మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆదిమూలపు సురేష్ కు గత ఎన్నికలలో జగన్ స్థానాచలనం చేసి ఎర్రగొండపాలెం నుంచి త‌ప్పించి కొండ‌పి నియోజకవర్గం పంపారు. అది టిడిపి కంచుకోట. ప్రస్తుతం మంత్రిగా ఉన్న వీరాంజనేయ స్వామి చేతిలో ఆదిమూలపు సురేష్ ఓడిపోయారు. ఈ క్రమంలోనే తన పాత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని సురేష్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.


అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్‌ను ఏదోలా అక్కడ నుంచి తప్పించి తన పాత స్థానంలో తిరిగి బాగా వేయాలని సురేష్ చాప కింద నీరులా చంద్రశేఖర్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వైసిపి వర్గాలలో ప్రచారం జరుగుతుంది. అయితే సురేష్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు కనిపెడుతున్న తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పాతుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య గ్రూపు రాజకీయంలో ఎర్రగొండపాలెం వైసిపి రాజ‌కీయం హాట్ టాపిక్‌గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: