
సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు చర్చలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు సమాచారం. మాదిగ, ఎస్టీ వర్గాల నుంచి ఒకరికి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిని కొనసాగించడం కష్టమని, ఒకరికి మాత్రమే చోటు ఇవ్వాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లతో చర్చలు జరిగాయి. అధిష్ఠానం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు కొత్త మంత్రులతో పాటు, మరో మూడు ఖాళీ స్థానాలు, చీఫ్ విప్ పదవి భర్తీకి కసరత్తు జరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేనందున, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన ఉంది. ఆది శ్రీనివాస్ ప్రస్తుతం విప్‌గా ఉన్నారు. పార్టీ నాయకులతో మీనాక్షి నటరాజన్ విస్తృత చర్చలు జరిపి, సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని విస్తరణ చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు