తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్  ఇష్యూలో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది .. ఇలా బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే .. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందితులు వదల్లేదని క్లారిటీగా అర్థమవుతుంది .. ఇక ఇప్పుడు తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఇష్యులో ఓ ప్రముఖ మీడియా సంస్థగా కొనసాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను నిందితులు ట్యాప్ చేశారు .. ఈ మేరకు సీట్ నోటీసులు ఇవ్వ‌గా రాధాకృష్ణ తన వాంగ్మూలం ఇచ్చారు .


2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొదలైందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది .. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలతోనే నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన బాస్‌లు ఇచ్చిన ఫోన్ నెంబర్లు అన్నిటిని ట్యాప్ చేసి వాటి వివరాలు బాస్‌లకు అందించారు .. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ , బిజెపికి చెందిన కీలక నేతల తో పాటు కొందరు బిఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది .. అలాగే మరికొందరు పోలీస్ అధికారులు ,  న్యాయమూర్తులు , ఇలా చిట్ట చివరకు మీడియా సంస్థల అధినేతులు కూడా ఇరుక్కుపోయారు.

 

ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పటికే  శ్రవణ్ రావు అనే ఓ మీడియా సంస్థ అధినేతను సిట్ ప్రశ్నించింది .. అయితే ఈయ‌న ఫోన్ ట్యాపింగ్ నిందితుడు .. అయితే ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం బాధితుడిగా సిట్ ముందుకు తన స్టేట్మెంట్ ఇచ్చారు .  ఎస్ఐబీ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించగా . అందులో  ఏబీఎన్ రాధాకృష్ణ పేరు కూడా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్న సిట్ అధికారులు వెంటనే ఆ విషయాన్ని రాధాకృష్ణకు చెప్పారు .. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉందని నోటీసులు ఇచ్చి మరి విచారణ కు కూడా పిలిచారు .. ఈ నోటీసులు ఆధారంగా ఈ శుక్రవారం అన‌గా ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్ ముందుకు వచ్చిన రాధాకృష్ణ ఒక గంట పాటు తన స్టేట్మెంట్ ను ఇచ్చి వెళ్లిపోయారు .

మరింత సమాచారం తెలుసుకోండి: