తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు.. ఆ విధంగానే  రాష్ట్ర ప్రత్యేక కల సాకారమైంది. అప్పటినుంచి రెండు పర్యాయాలు కేసిఆర్ పాలించారు. కానీ మూడవసారి  ప్రజలంతా కాంగ్రెస్ కి జై కొట్టి  రేవంత్ రెడ్డిని సీఎం చేసుకున్నారు. ఇదంతా బాగానే నడుస్తున్న తరుణంలో  కేటీఆర్ సరికొత్త వివాదాన్ని బయటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇండియా చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని మాయం చేశారని ఆయన అన్నారు.. అయితే తాజాగా  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు  వార్తల్లో నిలిచి తీవ్ర దుమారం రేపుతున్నాయి..మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ మళ్లీ ఆంధ్ర తెలంగాణ మధ్య సెంటిమెంటు రాజేయాలని అనుకుంటున్నారు. 

బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు  మాధవ్ తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా చిత్రపటాన్ని వారికి బహుమానంగా అందించారు. అయితే ఈ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం లేదని కేటీఆర్ అనడం  హైలెట్ గా నిలిచింది. తెలంగాణపై మరోసారి వివక్ష చూపిస్తున్నారని అసలు తెలంగాణను గుర్తించడం లేదని ఆయన మరోసారి సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉంటాయి. కలిసిపోయినట్టే కనిపిస్తాయి.. ఇందులో హైదరాబాద్ క్లియర్ గా కనిపిస్తోంది.

కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దానికి సంబంధించిన స్వరూపాన్ని క్లియర్గా అందులో పొందపరచలేదని కేటీఆర్ అనడంతో ఇది కాస్త  తెలంగాణ ప్రజల సెంటిమెంటును  రాజేసింది. దీనిపై కొంతమంది మేధావులు  ఆ ఫోటోలో తెలంగాణ రాష్ట్రం లేదనడానికి ప్రూఫ్ ఏంటి.. ఏదో ఒక వివాదం చుట్టివేయాలి కాబట్టి ఈ విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ స్పందించి ఇందులో తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెబితే  ఏదో సరిగ్గా కనబడలేదని మళ్ళీ కవర్ చేస్తారు. ఒకవేళ లేకుంటే సెంటిమెంట్ రగిలించి వారి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ అందులో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం ఉందా లేదా అనేది ఆ చిత్రపటం తీసుకున్న వారు క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: