దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన డి.కార్తీక్ రామ్ కిరీటి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. కార్తీక్ రామ్ తో పాటు జేఈఈ అడ్వాన్స్ డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 8వ ర్యాంక్ సాధించిన పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 311వ ర్యాంక్, ఆల్ ఇండియా ఎస్సీ కేటగిరీలో 2వ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన కంచుమర్తి ప్రణీత్ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి ఆయా విద్యార్థులు మంత్రిని కలిశారు. తమ ప్రతిభతో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆయా విద్యార్థులను మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా అభినందించారు.


మంగళగిరి శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలకే నేటితరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటేనే ఛాలెంజ్ అని, దీనిని స్వీకరించాలని, అధైర్యపడకూడదని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ మీరేనని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, కలల సాధనకు నిరంతంర శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్.తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: