ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, చెల్లి షర్మిల మధ్య ఆస్తి విభేదాలు ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కోర్టులో కొన్నిటికి సంబంధించి వ్యవహారాల నడుస్తున్న సందర్భంలో సరస్వతి సిమెంట్ షేర్ల పైన NCLT బెంచ్ విజయమ్మకు తాజాగా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలిసింది. సరస్వతి సిమెంట్ షేర్ల పైన జులై 29వ తేదీన NCLT హైదరాబాద్ బెంచ్ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఇదే తీర్పుని సవాల్ చేస్తూ విజయమ్మ చెన్నై బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది.


అయితే ఈ అప్పిల్ దాఖలకు సంబంధించి నిన్నటి రోజున విచారణ జరిగింది. ఈ సందర్భంగా విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ అన్ని అలాగే కొనసాగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. గతంలో జగన్ చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ పేర్ల మీద అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారంటు జగన్ ఆరోపణలు చేశారు. ఆ షేర్లకు  సంబంధించి అన్ని తన వద్దనే ఉన్నాయని వెంటనే రద్దు చేయాలి అంటూ NCLT లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2025 జూన్ 15న విచారణ చేపట్టిన ట్రైబ్యునల్  తీర్పును జులై 29వ తేదీకి రిజర్వు చేశారు.


షర్మిల, విజయమ్మ సరస్వతి షేర్లను బదిలీ చేయడం అక్రమమే అంటూ ఆ షేర్లను నిలిపివేయాలి అని NCLT ఆదేశాలను జారీ చేసింది. దీంతో NCLT హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ విజయమ్మ చెన్నై బెంచ్ లో అప్పీల్ చేయగా చెన్నై బెంచ్ ధర్మసనం తుది తీర్పు వెలుపడే వరకు వాటిని జగన్ కు  ఇవ్వకూడదంటు ధర్మాసనం తెలియజేసింది. ఇది మాజీ సీఎం జగన్ కు షాక్ అని చెప్పవచ్చు. అలాగే విజయమ్మ తరపున న్యాయవాది మాట్లాడుతూ.. షేర్ల బదిలీ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందంటూ వెల్లడించారు. మరి ఈ విషయం పైన షర్మిల ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: