భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం ౭.౩౦ గంటలకు న్యూజిలాండ్ మరియు ఇండియా ల మధ్య సూపర్ ౧౨ మ్యాచ్ జరగనుంది, ఇప్పటికే ఇరు జట్ల టీం లు అన్ని విధాలుగా సన్నద్దమయినట్లు తెలుస్తోంది. రెండు జట్లు తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్ ఆడనున్నాయి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్ కు వెళ్లడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి రావడానికి రెండు జట్ల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా విఫలం అవ్వడమే. పాక్ పేస్ దాటికి బెంబేలెత్తిపోయారు.

కాగా ఈ రోజు మ్యాచ్ లో ఫేవరేట్ భారత్ అనే చెప్పాలి. కానీ రికార్డు మాత్రం న్యూజిలాండ్ కే అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలవడానికి భారత్ కున్న బలాలు మరియు బలహీనతలు ఏమిటో ఒకసారి చూద్దాం.

బలాలు: ఐపిఎల్ లో పెద్దగా ఫామ్ లో లేని కెప్టెన్ కోహ్లీ పాక్ తో మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం శుభ పరిణామం. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే కివీస్ కు కష్టాలు తప్పవు. మంచి హార్డ్ హిట్టర్ గా పేరున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మ్యాన్ రిషబ్ పంత్ సైతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ బాల్ కి తగ్గట్టు షాట్ సెలక్షన్ ఉంటే ప్రత్యర్థికి వణుకు పుట్టించగలడు. మొదటి మ్యాచ్ ను బట్టి చూస్తే ప్రస్తుతానికి ఈ రెండు విషయాలే మనకు బాలాలు అని చెప్పాలి.

బలహీనతలు:  ఓపెనర్లు దారుణంగా విఫలం అవ్వడం, సూర్య కుమార్ యాదవ్ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, హర్థిక్ మరియు జడేజా అంచనాలకు తగిన విధంగా రాణించకపోవడం వంటివి బలహీనతలుగా చెప్పాలి.
ఇక బౌలింగ్ లో అయితే అన్నీ బలహీనతలే అని చెప్పాలి. మనకు టాప్ బౌలర్లు ఉన్నా ఆరంభంలో వికెట్లు తీయలేక పోవడం బలహీనతే అని చెప్పాలి. బుమ్రాను మొదటి స్పెల్ లోనే బౌలింగ్ చేయించి వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి.
కోహ్లీ బ్యాటింగ్ బాగున్నా ఫీల్డ్ లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకా మెరుగుపడాలి. మరి ఈ బలహీనతలను అధిగమించి ఈ రోజు మ్యాచ్ లో విజయాన్ని సాధిస్తుందా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: