
అది అందరికీ తెలుసు . అయితే ఇప్పటివరకు ఎప్పుడు చూడని రీతిలో మే 31న తిరుమలలో ఒకేరోజు 95080 భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఇది తిరుమలలో కొత్త రికార్డుగా నమోదయింది . గత 10ఏళ్లల్లో ఏ ఒక్కరోజు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో ఒక్కేరోజు భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనడం జరగలేదు . ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మే 31న తిరుమలలో సుమారు 95080 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఒక కొత్త రికార్డుగా నమోదయింది అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలిపారు.
టిటీడి తెలిపిన సమాచారం ప్రకారం "మే 16 నుంచి తిరుమలలో ఉన్న ఫలంగా భక్తుల రద్దీ పెరిగింది అని ..దానికి తగ్గాటే అన్ని విభాగాలలో సిబ్బంది నిరంతర పనిచేస్తూ వస్తున్నారు అని.. రక్షణ వ్యవస్థ నుంచి అన్నప్రసాద పంపిణీ వరకు అన్నీ కూడా సేవలు సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకతలను తీసుకున్నారని తెలిపారు ". అంతేకాదు మొత్తం భక్తుల సంఖ్య గత ఏడాది మే నెలలతో పోలిస్తే ఈసారి ఇంకా పెరిగింది అని .."2024 మేలు 23.23 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీ వారిని దర్శించుకోగా 2025 మేలో ఈ సంఖ్య 23.79 లక్షలకు చేరింది పెరిగింది అని.. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇంకా ఎక్కువ జనాభా శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలిపారు. అన్నప్రసాదాల విషయంలోను రికార్డ్ నమోదయింది, " 2024 మే లో 71 లక్షల మందికి పైగా అన్న వితరణలు జరగక ఇప్పుడు 2025 మేలో ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది . దాదాపు 1.33 కోట్లకు చేరినట్లు టిటిడి వివరించింది..!