
మొన్నటికి మొన్న ఐపిఎల్ లో మంచి ప్రదర్శన చేసి సిరాజ్ ఇప్పటికే టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మాట్ ల ప్లేయర్ గా కూడా మారిపోయాడు. అయితే ఇక ఇప్పుడు టీమిండియా ఆడుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు మహమ్మద్ సిరాజ్. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా 50 వికెట్లు సాధించిన మైలు రాయిని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ తో అదరగొట్టాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.
అంతేకాకుండా ఇంగ్లాండు గడ్డపై ఇప్పటివరకు ఆడిన 6 టెస్ట్ మ్యాచ్ లలో మొత్తం 22 వికెట్లు తీశాడు. అయితే ఒకవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లందరూ కూడా పరుగులు చేస్తూ దూసుకుపోతున్న సమయంలో సిరాజ్ ఇక వారి స్పీడుకు బ్రేకులు వేస్తూ.. తన బౌలింగ్ తో వికెట్లు పడగొట్టి షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇకపోతే టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ అజింక్య రహనే ఇటీవలే ఆస్ట్రేలియా ఆడిన మొదటి ఇన్నింగ్స్ లో ఇక టెస్ట్ ఫార్మాట్లో 100 క్యాచ్లు పట్టిన ప్లేయర్ గా కూడా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇకపోతే సిరాజ్ టెస్ట్ ఫార్మాట్లో అరుదైన రికార్డు సాధించడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.