బుల్లితెర సెలబ్రెటీలుగా పేరుపొందిన మానస-ప్రియతమ చరణ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పలు రకాల రూమర్స్ గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఈ మధ్య పెద్దగా ఎక్కడ కలిసి కనిపించడం లేదు.. మానస తన ఇద్దరు పిల్లలతో ఉంటూనే పలు రకాల వీడియోలను చేసుకుంటూ ఉండగా ఈ వీడియోలలో చరణ్ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వీటన్నిటి పైన క్లారిటీ ఇచ్చింది నటి మానస..


తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసిన ఒక వీడియోలో మానస తెలియజేస్తూ.. తన లైఫ్ లో ఏం జరుగుతోందో అంటూ చాలా మంది తనని అడుగుతున్నారని గత నాలుగు నెలలుగా తను టార్చర్ అనుభవిస్తున్నానని అయినప్పటికీ కూడా యూట్యూబ్ లో వ్లాగ్ చేయడం ఆపడం లేదు.. ఎందుకంటే తాను ప్రస్తుతం తన పిల్లలు ఇద్దరిని పెంచుకోవడానికి ఏకైక ఆధారం ఈ ఛానల్ అంటూ తెలిపింది. ఇది నేను సిగ్గు లేకుండా చెబుతున్నాను సింపతి కోసం చెప్పట్లేదు అంటూ తెలియజేసింది.


ఇది నేను చేతులారా చేసుకోలేదు బహుశా ఇద్దరి తప్పు ఉండవచ్చు.. దేవుడు తనని పరీక్షిస్తున్నాడేమో అంటున్నట్లుగా మేము విడాకులు తీసుకోలేదు. విడాకులు కావాలని కోర్టుకు వెళ్లలేదు.. కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాము ఇప్పుడు కూడా తాను స్టాండ్ తీసుకోకపోతే తన పిల్లల భవిష్యత్తు చాలా గందరగోరానికి గురవుతుంది అంటూ మాకు కొంచెం టైం ఇవ్వండి అన్ని సర్దుకుంటాయని తెలియజేసింది. అతని పని అతను చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటున్నాను తనను చాలా మిస్ అవుతున్నానని బాధతో తెలియజేసింది. ఏడుస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేము కదా త్వరలో తమ జీవితంలో ఏం జరగబోతుందో మీతో తెలియజేస్తానని తెలిపింది మానస. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: