మోడల్గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది నటి నందిని రాయ్. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత పెద్దగా క్రేజ్ రాకపోవడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది నందిని. అలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటు ఎవరికి తెలియని విషయాన్ని తెలియజేసింది. అయితే ఈ విషయం విన్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


నందిని రాయ్ మాట్లాడుతూ..2017,18 లో తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆ రెండేళ్లు తన జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని తెలిపింది.. ఒకపక్క సినిమాలలో నటిస్తూ ఉన్న సక్సెస్ కాలేదు.. ఒక సినిమా ఆగిపోయిందని డిప్రెషన్ లో ఉన్నాను వీటికి తోడు గోవా కి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగిందంటు తెలియజేసింది నందిని రాయ్. గోవాలో ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో నీటిలో ఒక క్లాత్ ప్రతిసారి తన కాలికి చిక్కుకున్నట్లు కనిపిస్తోందని. ఎన్నిసార్లు వదిలించుకున్న  కూడా అది చివరికి తనకే చిక్కుకుంటుందంటూ తెలిపింది.



కానీ చివరికి అది ఓపెన్ చేయగా ఎవరికో చేతబడి చేసి రెండు బొమ్మలు సూదులు సైతం గుచ్చి అందులో ఉంచారు. అలాగే జుట్టు పువ్వులు వంటివి కనిపించాయి. వాటిని చూసి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. ఆ తర్వాత మూడు రోజులపాటు చలి, జ్వరం వచ్చింది..ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని చావు మీద తనకి భయం మొదటిసారి వేసిందని.. వాటి నుంచి బయటపడడానికి సుమారుగా రెండు సంవత్సరాల వరకు సమయం పట్టింది.ఆ సమయంలో సినిమాలు వచ్చినా కూడా అనారోగ్య సమస్యల వల్ల తాను చేయలేకపోయానని తెలిపింది నందిని  రాయ్. అయితే అప్పట్లో ఆ సినిమాలు చేసి ఉంటే మరింత సక్సెస్ వచ్చేదేమో అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: